Showing posts with label such. Show all posts
Showing posts with label such. Show all posts

Thursday, November 8, 2012

Mohan babu is not such kind of person say's chennai brahmin's

నటుడు మోహన్ బాబు చాలామంచి వ్యక్తి అనీ, బ్రాహ్మణుల పట్ల అమితమైన గౌరవం కలిగిన వ్యక్తి అని చెన్నై నగరం నుంచి వచ్చిన బ్రాహ్మణులు కితాబిచ్చారు. మంచి వ్యక్తిపై ఇలాంటి దుష్ట కార్యాలు తగదనీ, బతికున్నవారికి పిండ ప్రదానాలు చేయడం దుష్టకార్యమనీ, అలాంటి ప్రవర్తన కలవారు తమ ప్రవర్తనను మార్చుకుని సన్మార్గంలో పయనించాలని కోరారు.

దేనికైనా రెడీ చిత్రం గురించి విలేకరులు మోహన్ బాబును అడిగినప్పుడు... దానిపై నేను మాట్లాడను. జరిగిన విషయం గురించి, జరుగబోతున్న దాని గురించి మాట్లాడకూడదు. అది కోర్టులో ఉన్నది. విపులంగా చెప్పే రోజు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చెపుతాను అని అన్నారు.

మరోవైపు 'దేనికైనా రెడీ' సినిమా వివాదంపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీ ఈనెల 10వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వివాదాస్పద అంశాలేమయినా ఉంటే తమకు నివేదికలో తెలియజేయాలని సూచించింది.

FG HBT.blogspot.com

Related Posts