హైదరాబాద్ : నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి(నిర్మాత రామానాయుడు కూతురు) చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. నాగార్జున-లక్ష్మిల సంతానం నాగ చైతన్య తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. భర్త నాగార్జునతో విడిపోయినప్పటికీ లక్ష్మి దగ్గుబాటి తన తనయుడు నాగ చైతన్యతో టచ్ లోనే ఉంటోందట. నాగ చైతన్య కొండాపూర్లో ఖరీదైన త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొన్నాడని, ఈ ఫ్లాటుకు ఇంటీరియల్ డెకరేషన్ పనులను లక్ష్మి దగ్గుబాటి దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్. తన కొడుకు అభిరుచికి తగిన విధంగా ఖర్చు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారట.మరికొన్ని నెలలో ఈ ప్లాట్ పనులు పూర్తవుతుందని, త్వరలోనే నాగ చైతన్య తన సన్నిహితులకు ఇందులో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా తనయుడి పెళ్లి గురించి కూడా ఆమె ఆలోచిస్తోందని, త్వరలోనే ఈ విషయమై కార్లరిటీ రానుంది.నాగ చైతన్య నటిస్తున్న ఆటోనగర్ సూర్య వివరాల్లోకి వెళితే...దడ, బెజవాడ ప్లాపు కావడంతో హిట్ కోసం పరితపిస్తున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య మళ్లీ పరిశ్రమలో తన సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. దేవా కట్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హాట్ లేడీ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
FG HBT.blogspot.com
FG HBT.blogspot.com
No comments:
Post a Comment