Thursday, November 8, 2012

Anushka become a new producer

 నటిగా తెలుగులో సంపాదిస్తూ ఏకంగా ప్రొడక్షన్‌లోకి దిగబోతోంది అనుష్క. ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది. ఆర్యతో సెథై చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత శింబుతో జతకడుతోంది. ఆ తర్వాత సూర్యతో సింగం-2లో బుక్‌ అయింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో బిర్యానీలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో పెద్ద హీరోల చిత్రాల్లో నటించడానికి అంగీకరిస్తోంది.
చిన్నాచితకా చిత్రాల్లో నటించనని మొహంమీదే చెప్పేస్తోంది. ప్రస్తుతానికి 40నుంచి 70 లక్షలు డిమాండ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ అగ్రనిర్మాణసంస్థ అప్రోచ్‌ కావడంతో.. కోటి రూపాయలకు పెంచేసింది. మరోవైపు తను నిర్మాణసంస్థను ఆరంభించాలని ప్లాన్‌లో ఉంది.
ఇందుకు శింబు సలహాను కూడా అడిగింది. శింబు ఆధ్వర్యంలో ప్రొడక్షన్‌ నడపాలనే ఆలోచిస్తుంది. ఈ విషయమై స్పందిస్తూ... రకరకాల రూమర్స్‌ మాపై వస్తున్నాయి. కానీ... దానికంటే నిర్మాణ సంస్థను స్థాపించి కొందరికైనా పని కల్పించాలని చూస్తున్నాని అంది. మంచి నిర్ణయమే కదా.

 FG HBT.blogspot.com


No comments:

Post a Comment

Related Posts